శ్రీనువైట్లకు మరో అవకాశం..!

‘దూకుడు’ సినిమా తర్వాత సక్సెస్‌ మొహం చూడని దర్శకుడు శ్రీనువైట్ల ఇటీవలే ‘మిస్టర్‌’ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని తెరకెక్కించాడు. ఆ సినిమా మరింత చెడ్డ పేరును శ్రీనువైట్లకు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా సిద్దంగా లేడని, ఆయనతో సినిమా అంటేనే హీరోలు జంకుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

శ్రీనువైట్ల, రామ్‌ల కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల క్రితం ‘రెడీ’ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని రామ్‌ కోరుకుంటున్నాడు. ఆమద్య ఒక కథ కూడా సిద్దం అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. శ్రీనువైట్లకు అప్పుడు స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు వస్తున్న సమయంలో రామ్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు రామ్‌ను ఆశ్రయించగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

రామ్‌ కెరీర్‌లో ఒక మంచి సినిమాగా నిలిచిన రెడీ సినిమా కోసం ప్రస్తుతం శ్రీనువైట్ల పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే అంటే ఈ సంవత్సరం చివర్లో శ్రీనువైట్లతో జత కలిసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend