శ్రీముఖి అన్నీ సర్దుకొని వెళ్లిపోతోంది.

యాంకర్ శ్రీముఖికి అనుకోని అవకాశం వచ్చింది. ఓ పెద్ద షోలో పాల్గొనడానికి భారీ మొత్తం ఇస్తామని ఆశచూపడంతో ఆమె ఒప్పుకొని వెళ్లిపోతోంది..దీంతో ఇప్పుడు ఆమె తెలుగు చానల్స్ లో చేస్తున్న షోలన్నీ ఆగిపోయే ప్రమాదంలో పడ్డాయి. శ్రీముఖి నిర్ణయంతో బుల్లితెరపై ఆమె చేస్తున్న పటాస్, లేడిస్ ప్రోగ్రాంలు ఏమవుతాయోనని ఆందోళన ఆయా నిర్మాతలకు నెలకొంది. రెండు నెలల పాటు శ్రీముఖి ముంబై వెళ్లి అక్కడ ఇంట్లో ఎలాంటి ఫోన్, టీవీ లేని ఇంట్లో ఉండబోతోంది..

దీంతో ఇక ఆమె బుల్లితెరపై కనిపించే చాన్స్ ఉండదని తెలిసింది. అయితే పటాస్ షో వివాదాస్పదం కావడంతో ఆ షోను ఆపేసేందుకు ఈటీవీ రెడీ అయ్యిందని అందుకే శ్రీముఖి ప్రస్తుతం తనకు వచ్చిన బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇందుకోసం భారీ మొత్తం ఆఫర్ చేయడం కూడా శ్రీముఖి ఒప్పుకోవడానికి కారణంగా చెబుతున్నారు.

మొదట సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి అక్కడ అవకాశాలు దక్కకపోవడంతో ఇక బుల్లితెరపై పడింది. పటాస్ తో పాపులర్ అయ్యింది. అడపాదడపా తెలుగు చానల్స్ లో యాంకరింగ్ అవకాశాలను చేజిక్కించుకుంటోంది..ఇ ప్పుడు యాంకర్ శ్రీముఖికి భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో శ్రీముఖికి అవకాశం వచ్చిందని సమాచారం. ఈ షో కోసం ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారి జాబితాలో శ్రీముఖి కూడా ఉందనే విషయం ఈరోజు రిలీవ్ అయ్యింది. ఇందుకోసం కోటి రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలిసింది. భారీ మొత్తం వస్తుండడంతో ప్రస్తుతం చేస్తున్న షోలన్నింటిని పక్కనపెట్టి శ్రీముఖి ఈ బిగ్ బాస్ లో నటించేందుకు బయలు దేరి వెళ్లినట్టు సమాచారం.

To Top

Send this to a friend