జూలై 7న “స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్”

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మెన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో ఓ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా స్పైడీకి కోట్లకొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి ఘ‌న‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది.స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్ర‌త్యేఖంగా హైద‌రాబాద్ లో స్పైడి కేర‌క్ట‌ర్ మీడియా పాత్రికేయుల తో క‌లిశారు. ఆ త‌రువాత దేవనార్ విజువ‌ల్సి ఛాలెంజెడ్ స్క్రూల్ లో దాదాపు 500 మంది పిల్ల‌ల‌తో త‌న విన్యాశాల‌తో అల‌రించారు.

దాని త‌రువాత కొన్న మీడియా హైస్ ల‌కి విచ్చేసి వారికి సెల్ఫిల‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోఈ సినిమా విడుదల కాబోతుంది. . మార్వెల్ కామిక్స్,కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోని పిక్చ‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.

To Top

Send this to a friend