‘స్పైడర్‌’ టీజర్‌ కొత్త డేట్‌


సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా స్పైడర్‌ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మహేష్‌బాబు ప్రకటించాడు. అయితే తాజాగా దాసరి నారాయణ రావు మృతి చెందిన నేపథ్యంలో సినిమా టీజర్‌ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

నేడు విడుదల కావాల్సిన టీజర్‌ను రేపు ఉదయం 10.30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మరో ప్రకటనలో చిత్ర నిర్మాత పేర్కొన్నాడు. ఈ టీజర్‌ కోసం మురుగదాస్‌ దాదాపు వారం రోజుల పాటు మహేష్‌బాబుపై ప్రత్యేకంగా కొన్ని షాట్స్‌ను చిత్రీకరించడం జరిగింది. మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లపై కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు, కొన్ని యాక్షన్‌ విజువల్స్‌ కూడా మురుగదాస్‌ టీజర్‌లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ ఈ సినిమాను 110 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ మరియు మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

To Top

Send this to a friend