మనుషులను చంపే విలన్ కథ ‘స్పైడర్’ 

మహేశ్ బాబు -మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ టీజర్ ను గమనిస్తే..పెరుగుతున్న జనాభాను భూంకంపం తరహాలో చంపేసే ఓ విలన్.. అతడికి భయపడిపోయే జనాలు.. అతడిని భయపెట్టడానికి వచ్చేవాడే స్పైడర్. ఇక సినిమాలో హీరో మహేశ్ బాబు… భయం అంటే తెలియని విలన్ కు భయాన్ని పరిచయం చేస్తాడు. ప్రభుత్వంలో ఓ కీలకమైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా విలన్ ఆటకట్టించే పాత్రలో మహేశ్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నారు.

మహేశ్ బాబు హీరోగా.. మురగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం స్పైడర్.. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా స్పైడర్ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా మురగదాస్ ఈ చిత్రాన్ని లేట్ చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ తో సినిమా తీయడంలో కూడా డిలే అయిపోయింది. దీంతో స్పైడర్ టీజర్ కోసం అభిమానులు చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మహేశ్ అభిమానులకు ఊరటనిస్తూ స్పైడర్ టీజర్ ను విడుదల చేశాడు.

తమిళ వెర్షన్ టీజర్ కూడా మహేశ్ బాబే సొంతంగా డైలాగులు చెప్పుకోవడం విశేషం. మహేశ్ స్కూలు, కాలేజీ చదువులు చైన్నైలోనే పూర్తి కావడంతో మహేశ్ కు తమిళం బాగా తెలుసు. సో బాగా డైలాగులు పలికించేశాడట.. ఇక ఈ సినిమాలో సోషల్, పొలిటికల్ అంశాలను దర్శకుడు మురగదాస్ బాగా గట్టిగానే టచ్ చేసినట్టు కనిపిస్తున్నాడు. దాక్కున్న విలన్ ను భయపెట్టి అతడికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం టీజర్ లో కనిపించింది. ఇందులో మహేశ్ నటన అద్భుతంగా ఉంది. మొత్తానికి మురగదాస్, మహేశ్ బాబు కాంబినేషన్ లో ఓ సరికొత్త సినిమాను మనం వెండితెరపై చూసే అవకాశం దక్కబోతోంది.. ఇది ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి..

To Top

Send this to a friend