‘స్పైడర్‌’పై ఆసక్తి చూపుతున్న బాలీవుడ్‌ బాహుబలి


బాలీవుడ్‌లో ప్రస్తుతం బాహుబలికి ఈ స్థాయి క్రేజ్‌, గుర్తింపు దక్కింది అంటే అది ఖచ్చితంగా కరణ్‌ జోహార్‌ వల్లే అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. మొదటి పార్ట్‌ ‘బాహుబలి’ కోసం కరణ్‌ జోహార్‌ చాలా కష్టపడి ప్రమోషన్స్‌ చేశాడు. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల రెండవ పార్ట్‌పై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడం జరిగింది. బాలీవుడ్‌లో బాహుబలి 2 రికార్డు స్థాయిలో 500 కోట్లు వసూళ్లు చేసింది అంటే అది కరణ్‌ జోహార్‌ వల్లే సాధ్యం అయ్యింది. ఇప్పుడు అదే కరణ్‌ జోహార్‌ స్పైడర్‌పై ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది.

‘బాహుబలి’ సినిమాతో సౌత్‌ సినిమాలపై బాలీవుడ్‌ వారికి నమ్మకం పెరిగింది. అందుకే స్పైడర్‌ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ హిందీలో డబ్‌ చేయాలని భావిస్తున్నాడు. భారీ మొత్తాన్ని ప్రస్తుతం ఆయన నిర్మాతలకు ఆఫర్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హిందీలో మురుగదాస్‌ తెరకెక్కించిన సినిమాలు ఘన విజయం సాధించడంతో పాటు, స్పైడర్‌ చిత్రం బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కుతుంది.

ఈ కారణాల వల్ల బాలీవుడ్‌లో ‘స్పైడర్‌’ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తానన్నారట. ట్రేడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కరణ్‌ జోహార్‌ ‘స్పైడర్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌లో వంద కోట్ల చిత్రంగా చేయాలని కోరుకుంటున్నాడట. కరణ్‌పై ఉన్న నమ్మకంతో ‘స్పైడర్‌’ నిర్మాతలు కూడా ఆయనకే హిందీ రైట్స్‌ను ఇవ్వాలని భావిస్తున్నారు.

To Top

Send this to a friend