దక్షిణాది అభిమానమే మాకు అడ్డు..

 

సల్మాన్ ఖాన్ దక్షిణాది సినిమాలపై, హీరోలపై నోరుపారేసుకున్నాడు. ‘‘దక్షిణాది సినిమాలను హిందీలో ఆదరిస్తున్నాం. కోట్ల కలెక్షన్లు ఇస్తున్నాం. మరి మా బాలీవుడ్ సినిమాలను మీ దక్షిణాదిలో ఎందుకు ఆదరించడం లేదంటూ.. మా ప్రేక్షకుల గొప్పదనం ముందు ఈ దక్షిణాది అభిమానుల అభిమానం దిగదుడుపేనని’’ సల్మాన్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మూసకథలకు భిన్నంగా బాహుబలి తీసి హిందీలో విడుదల చేసి రాజమౌళి హిట్ కొట్టాడు. కోట్లు కురిపించాడు. ఇలాంటి కథాంశాలు హిందీలో చాలా తక్కువ వస్తాయి. అందుకే బాహుబలి విడుదల కాగానే హిందీ జనాలు ఆదరించారు. కోట్ల కలెక్షన్లు కురిపించారు.

అలాంటి కథలు తీసే తెలివి సల్మాన్, అక్కడి దర్శకులకు లేదు. ఎంతసేపు అరువు కథలే.. తెలుగు, తమిళ కథలను అరువు తెచ్చుకొని హిందీలో తీసి హిట్ కొడుతున్నారు. సల్మాన్ అయితే వరుసగా తెలుగులో హిట్ అయిన పోకిరి, కిక్ లాంటి సినిమాలను తీసి విజయాన్ని అందుకున్నారు. సల్మాన్ తీసిన బజరంగీ కథ రాజమౌళి తండ్రే అందించారు. దక్షిణాది సినిమాలనే రిమేక్ చేసి బాలీవుడ్ లో నిలబడ్డ సల్మాన్.. ఇప్పుడు అదే దక్షిణాది వారిపై, సినిమాలపై కామెంట్ చేయడం దుమారం రేపింది. ప్రబాస్ పై, బాహుబలిపై నోరు పారేసుకున్న సల్మాన్ ముందు మంచి సినిమాలు తీస్తే అంతటా విజయం వరిస్తుందనేది గుర్తు చేసుకోవాలి.

క్రిష్ లాంటి హిందీ సినిమా తెలుగు, తమిళ్ లో ఆడింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్కడైన ఆడుతుందని బాహుబలి నిరూపించింది. అదే సల్మాన్ సినిమాలు కంటెంట్ లేదు కాబట్టే దక్షిణాదిలో ఆడడం లేదు. అది తెలుసుకోకుండా బాహుబలి లాంటి భారీ విజయంపై అసూయ చెందడం.. దక్షిణాది వారు ఇతర బాలీవుడ్ హీరోల సినిమాలు చూడరని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

To Top

Send this to a friend