తల్లిదండ్రుల బెడ్ రూంలో కెమెరా పెట్టిన కొడుకు..

ఫేస్ బుక్ వాట్సాప్, ఫోన్ పిచ్చి ఎక్కడికి తీసుకెళుతుందనడానికి నిదర్శనం ఈ వార్త.. బెంగళూరులో తాజాగా జరిగిన సంఘటన ఓ తల్లిదండ్రులకు చిక్కులు తెచ్చిపెట్టింది. కొడుకు మారాం చేస్తున్నాడని స్మార్ట్ ఫోన్ కొనిస్తే అది వారికే ఎసరు తెచ్చింది..

బెంగళూరుకు చెందిన ఓ 13 ఏళ్ల బాలుడికి తండ్రి కొత్త స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. దీంతా ఆ బాలుడు ఫేస్ బుక్ లో చాట్ చేస్తుండగా.. తేజస్ పటేల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ బాలుడికి అదే పనిగా బూతు వీడియోలు పంపి వాటిని చూడమని తేజస్ ప్రోత్సహించాడు. దీంతో సెక్స్ వీడియోలకు బానిసైన బాలుడు ఇంకా కావాలని అడిగాడు.

దీంతో మెల్లగా తేజస్ పటేల్ తన ప్లాన్ ను అమలు చేశాడు. బాలుడిని వాళ్ల తల్లిదండ్రుల బెడ్ రూంలో కెమెరా పెట్టి వీడియో ఆన్ చేయమని చెప్పాడు. అలాగే చేసిన బాలుడు.. తల్లిదండ్రులు సెక్స్ చేస్తున్న వీడియోను సదురు వ్యక్తికి ఫేస్ బుక్ లో పంపించాడు..

బాలుడి తల్లిదండ్రుల సెక్స్ వీడియోలు చేజిక్కడంతో తేజస్ పటేల్ వారితో బ్లాక్ మెయిలింగ్ కి దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఈ సెక్స్ వీడియోను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. దీంతో బాలుడు చేసిన పని ఆ తల్లిదండ్రులకు పెను విఘాతం అయ్యింది.పరిస్థితి చేజారడంతో వారు తేజస్ పటేల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

To Top

Send this to a friend