‘బిగ్‌బాస్‌’ షోలో నిజంగా వీళ్లు ఉంటే!!


తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు ఆ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఒక్కరు అంటే ఒక్కరు కూడా బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనబోతున్నట్లుగా వెళ్లడి చేయలేదు.

స్టార్‌ మా వారు కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. షో ప్రారంభంకు వారం రోజుల ముందు సెలబ్రెటీలతో టీజర్‌ను వేయనున్నారట. అయితే ఈలోపుగానే కొందరు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం అంటూ కొన్ని పేర్లు చెబుతున్నారు. ఆ పేర్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతున్నాయి. కాని వారిని ఈ షోలో తీసుకు వస్తే షో క్రేజ్‌ పోతుందని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వారిని ఎన్నో సార్లు చూసి చూసి విసిగి పోయాం, ఇక వారిని మళ్లీ మళ్లీ చూడలేం అంటున్నారు. ఇంతకు వారు ఎవరో తెలుసా… మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి, రంభ, సదా, స్నేహా, పోసాని కృష్ణమురళి, ధన్‌రాజ్‌. వీరితో పాటు ఇంకా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాని ఈ పేర్లు మాత్రం ప్రముఖంగా ప్రచారం జరుగుతున్నాయి.

ధన్‌రాజ్‌ మినహా మరెవ్వరు కూడా బిగ్‌ బాస్‌ షోలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇటీవలే పోసాని తాను బిగ్‌ బాస్‌ షోలో చేయడం లేదు అని చెప్పేశాడు. ఇక రంభ, స్నేహా, మంచు లక్ష్మిలకు చిన్న పిల్లలు ఉన్నారు. వారిని వదిలేసి 71 రోజులు బిగ్‌ బాస్‌ హౌస్‌లో గడపలేరు. అందుకే వారు ఉండరు. ఒక వేళ వారు షోలో ఉన్నా కూడా ప్రేక్షకుల విమర్శలు మరియు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ షో గురించి ప్రస్తుతం ఏ స్థాయిలో జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, అదే స్థాయిలో ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.

To Top

Send this to a friend