జగన్ మీడియాపై బాబు అటాక్..


చంద్రబాబుకు కంట్లో నలుసులా మారిన సాక్షి పై దాడి మొదలైంది. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు పరువు గంగలో కలిపేస్తున్న పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకుడిని నిన్ననే అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో భాగంగానే దాడులు ప్రారంభించారు. ఏపీ పోలీసులు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంపై దాడి చేశారు. హైదరాబాద్ కార్యాలంలోకి ప్రవేశించిన పోలీసులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు , అనిల్, తదితరులు వెంటనే సోషల్ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. సోదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే సోషల్ మీడియాపై అనంతపురం పర్యటనలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో చర్యలు ప్రారంభించారు. ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలోకి చొరబడి సోదాలు చేశారు. వైసీపీ ఐటీ వింగ్ కు చెందిన చల్లా మధుసూదన్ రెడ్డి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని.. ఈనెల 25న విచారణకు రావాలని ఏపీ పోలీసులు వారికి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అనేక అవాకులు, చవాకులు పేలారని.. సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్ లు వైఎస్ జగన్ పై పెట్టారన్నారు. ఈ విషయంలో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ను దూషిస్తూ మంత్రి లోకేష్ పెట్టి ట్వీట్లను వైసీపీ నేతలు పోలీసులకు చూపించారు. వైసీపీలోని అన్ని విభాగాలకు తానే ఇన్ చార్జిని అని నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

To Top

Send this to a friend