అచ్చం ఐశ్వర్యారాయ్‌కి జెరాక్స్ కాపీలా ఉందే. హౌ సో క్యూట్! అంటూ తెలుగు యూత్ తెగ ఇదైపోయారు. స్నేహా ఉల్లాల్‌ని గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. అయినా ఏం ప్రయోజనం సరైన సక్సెస్ పలకరించక బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌లా మిగిలిపోయింది. చివరికి ఇండస్ట్రీ నుంచే అదృశ్యమైంది. కట్ చేస్తే ఇప్పుడిలా షాకింగ్ న్యూస్‌తో వార్తల్లోకొచ్చింది. అసలింతకీ ఏమా షాకింగ్ డిసీజ్? అంటే..చక్కనమ్మ స్నేహా ఉల్లాల్‌కి ఏమైంది? విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అంతటి అందగత్తె ..అసలు కనిపించదేం? అంటూ అభిమానుల్లో ఇటీవల ఒకటే కలవరం. నేను మీకు తెలుసా? , సింహా, కరెంట్ వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి తెలుగు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది. అలాగని హిందీలో అయినా నటిస్తోందా? అంటే అదీ లేదు.. అసలేమైంది? అంటూ ఆరా తీస్తే ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. స్నేహ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
అది రక్తానికి సంబంధించిన ఇల్నెస్. రక్త కణాల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అట. దీనివల్ల స్నేహ పూర్తిగా వీకైపోయింది. కనీసం 30 నిమిషాలు మించి నిలబడలేనంత వీక్ అయ్యిందిట. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పింది.2014 ముందే (సింహా టైమ్) అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసి, అప్పుడే మెడికేషన్ మొదలు పెట్టాను. ఇప్పటికి పూర్తిగా కోలుకున్నాను. ఇన్నాళ్లకు నటించేందుకు ఫిట్‌గా ఉన్నాను. నాకు పరిశ్రమలో అవకాశాలు రాకపోవడం అన్నది లేదు. నిర్మాతల నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అనారోగ్యం వల్లనే అంగీకరించలేకపోయాను… అనీ కాస్త వ్యథతో చెప్పుకొచ్చింది స్నేహ. ప్రస్తుతం ఉల్లాల్ `ఆయుష్మాన్ భవ` అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో కేథరిన్, అమలాపాల్ నాయికలుగా నటిస్తున్నారు.
