జ్వరబాధితులకో పొట్లకాయ!

విటమిన్‌-ఎ, బి, సిలతోబాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌… వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్న పొట్లకాయ ఎముక ఆరోగ్యానికీ దంత సంరక్షణకీ ఎంతో మంచిదన్నది తెలిసిందే. అంతేకాదు, పొట్లకాయ అనేక వ్యాధుల నివారణకీ దోహదపడుతుంది. వాంతులూ విరేచనాలతో కూడిన జ్వర నివారణకి పొట్లకాయ మంచి ఔషధంగా పనిచేస్తుందని సంప్రదాయవైద్యం పేర్కొంటోంది. మలేరియా జ్వర బాధితులకి పొట్లకాయ రసం మంచి మందు. ఇది యాంటీబయోటిక్‌గానూ పనిచేస్తుందని అనేక ఆధునిక పరిశోధనల్లోనూ తేలింది.

* చైనా సంప్రదాయ వైద్యం ప్రకారం – మధుమేహానికి పొట్లకాయ అద్భుత ఔషధంలా పనిచేస్తుందట. పైగా క్యాలరీలు కూడా తక్కువ కావడంతో బరువూ తగ్గుతారు. ఇందులోని పీచు మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి కూడా పొట్లకాయ తోడ్పడుతుంది. అందుకే దీన్నుంచి తీసిన రసం రోజూ రెండు కప్పులు తాగితే హృద్రోగ సమస్యలు తగ్గుతాయట. బీపీనీ తగ్గిస్తుంది.

* పొట్లకాయ శరీరంలోని టాక్సిన్లను సమర్థంగా తొలగిస్తుంది. మూత్రపిండాలూ, మూత్రాశయం పనితీరునీ మెరుగుపరుస్తుంది.

* గొంతులోని కఫాన్ని తగ్గించడంతోబాటు శ్వాసవ్యవస్థ పనితీరుకీ దోహదపడుతుంది.

* పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తరవాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది.

To Top

Send this to a friend