రంగస్థలంలో చరణ్‌కు గాయాలు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సమంత హీరోయిన్‌గా ప్రకాష్‌ రాజ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పరిసర పల్లెటూరు ప్రాంతంలో జరుగుతుంది.

గత కొన్ని రోజులుగా చాలా సీరియస్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌లో చిన్న అపశృతి చోటు చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఒక సీన్‌ చిత్రీకరణ సమయంలో రామ్‌ చరణ్‌కు స్వల్ప గాయం అయ్యిందని, గాయంకు ప్రధమ చికిత్స చేయించుకుని గంటలో మళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఒక్క రోజు అయినా రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా సుకుమార్‌ సూచించినా కూడా రామ్‌చరణ్‌ కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నాడు.

ఈ చిత్రంలో చరణ్‌ చెవిటి వాడిగా నటిస్తున్నాడనే టాక్‌ విపిస్తుంది. ఈ సినిమా కథేంటి, చరణ్‌ పాత్ర ఏంటి అనే విషయాలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే సుకుమార్‌ ప్రకటించాడు.

To Top

Send this to a friend