ఆడపోలీస్ నిజాయితీ నిలవలేని యోగి

 

శ్రేష్ట ఠాకూర్.. యూపీలో బులంద్ షహర్ ప్రాంతంలో ఓ ఆడ పోలీస్ ఆఫీసర్.. ఆమెను అర్ధాంతరంగా యూపీ సీఎం యోగి నేపాల్ బర్డర్ లోని ఓ మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆమె చేసిన నేరం ఏంటంటే.. బీజేపీ నాయకులను అడ్డుకొని నిలదీయడమే.. హెల్మెట్, ఆర్సీ బుక్ లేకుండా పయనిస్తున్న బీజేపీ నేతలను శ్రేష్ట అడ్డుకుంది. దానికి వారు రెచ్చిపోయి శ్రేష్ట తో వాగ్వాదానికి దిగారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు సదురు బీజేపీ నేతలను జైలు కు పంపింది ఆమె..

శ్రేష్టతో బీజేపీ నాయకుల గొడవ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేగింది.. యూపీలో బీజేపీ నేతలు అధికారం పేరుతో చేస్తున్న యాగీ తేటతెల్లమైంది. దీన్ని సమర్థంగా అడ్డుకున్న పోలీస్ ఆఫీసర్ గా శ్రేష్ట పేరు మారుమోగిపోయింది. కానీ ఇక్కడే రాజకీయం పనిచేసింది. ఆమెను బలిచేసింది..

సమర్ధ అధికారం వల్ల తాము వేగలేకపోతున్నామని బులంద్ షహర్ ప్రాంతంలోని 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్దకు పేచీకి వెళ్లారు. ఆమె ఉంటే తామంతా రాజీనామా చేస్తామని బెదిరించారు.దీంతో యోగీ ఆ ఒత్తిడికి తలొగ్గి ఆమెను నేపాల్ బార్డర్ లోని మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేశాడు. ట్రాన్స్ ఫర్ అయ్యాక స్పందించిన శ్రేష్ట.. ‘తానొక వెలుగుతున్న అగ్నిని అని ఎక్కడైనా వెలుగులనిస్తా’ అని ట్వీట్ చేసింది.

శ్రేష్ట ట్వీట్ యూపీ సీఎం యోగిని బలంగా తాకింది. యోగి కూడా సాధారణ పొలిటిషియన్ అనిపించుకున్నాడు. ఒత్తిడికి తలొగ్గి పోలీస్ ఆఫీసర్ ను బదిలీ చేయడంతో యోగిపై విమర్శల వాన కురుస్తోంది. ఇన్నాళ్లు వచ్చిన కీర్తి ఒక్క పోలీస్ ఆఫీసర్ బదిలీతో పోయింది. యోగి కూడా ఇలా చేస్తాడా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

బీజేపీ నాయకులు పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠతో పడిన గొడవ వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend