క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందిన శింబు, నయనతార ‘సరసుడు’

‘మన్మథ’, ‘వల్లభ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరో శింబు. ఆ రెండు చిత్రాల్లో శింబు పెర్‌ఫార్మెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవడమే కాదు.. తనని ఓన్‌ చేసుకున్నారు. తాజాగా శింబు హీరోగా గ్లామర్‌ బ్యూటీస్‌ నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ ఫేమ్‌ టి. రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌ రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌పై టి.రాజేందర్‌ నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరసుడు’. ఇటీవల రాక్‌స్టార్‌ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేసిన ఈ చిత్రం ఆడియో మంచి హిట్‌ అయ్యింది. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌.కురళఅరసన్‌ అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు ఎక్స్‌ట్రార్డినరీగా రీ-రికార్డింగ్‌ అందించడం ఓ విశేషం కాగా టి.రాజేందర్‌ ఈ చిత్రానికి పాటలు, మాటలు రాయడం మరో విశేషం. శింబు, నయనతార విడిపోయిన తర్వాత వస్తోన్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ అటెన్షన్‌ నెలకొంది. సినిమా సూపర్‌.. అంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. జూలై నెలలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.


ఈ సందర్భంగా నిర్మాత టి.రాజేందర్‌ మాట్లాడుతూ – ”రియల్‌ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా, ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ చాలా బాగా తీశారు. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి కురళఅరసన్‌ చక్కని మ్యూజిక్‌ అందించాడు. విజువల్‌గా కూడా స్క్రీన్‌పై చాలా బాగుంటాయి. ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. మెయిన్‌గా శింబు, నయనతారల మధ్య వచ్చే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రానికే హైలైట్‌. తెలుగులో మా శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు సినిమా ఇది. మా చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక్క కట్‌ చెప్పకుండా ‘సినిమా చాలా బావుంది.. శింబు, నయనతారలకు మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది’ అనడంతో చిత్రంపై మేము పెట్టుకున్న నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఏ సినిమా అయినా నచ్చితే ఆ చిత్రాన్ని చాలా పెద్ద హిట్‌ చేస్తారు. యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో చాలా వున్నాయి. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది. జూలై నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో రిలీజ్‌కి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్‌ ఎంఎ, సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ: సతీష్‌, రచనా-సహకారం: బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌, నిర్మాత: టి.రాజేందర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌.

To Top

Send this to a friend