పూరి కొంపముంచిన శ్యాం.కే.నాయుడు

 

అనుకున్నట్టే అయ్యింది.. పూరి జగన్నాథ్ కు ఉచ్చు బిగుస్తోంది. మొదటిరోజు విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని పూరి.. పోలీసులకు స్పష్టం చేశారు. కానీ ఆయన వద్ద పనిచేసిన కెమెరామెన్ శ్యాంకే నాయుడు మాత్రం పూరి డ్రగ్స్ తీసుకోవడం.. ఇతర నటులకు పంచడం తాను చూశానని చెప్పి సంచలనం సృష్టించాడు.

 

పూరి జగన్నాథ్ సినిమాలకు ఆయనే కెమెరామెన్.. పూరితో ఇప్పటికే దాదాపు 17 సినిమాలకు కెమెరామెన్ గా చేశారు. పూరితో సన్నిహిత సంబంధాలు, విడదీయలేని బంధం శ్యామ్ కే నాయుడిది.. తెలుగు ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న కేసులో విచారిస్తున్న ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందం కెమెరామెన్ శ్యామ్ కే నాయుడిని విచారించింది. ఈ విచారణలో పూరి జగన్నాథ్ సిగరెట్ లో డ్రగ్స్ తీసుకుంటాడని.. దాన్ని నేను చూశానని శ్యాంకే నాయుడు పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం…

 

అయితే కిందటిరోజు పూరి జగన్నాథ్ తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని చెప్పిన దానికి ఆయన వద్ద పనిచేసిన శ్యాంకే నాయుడు చెప్పిన దానికి పొంతన లేకుండా పోయింది. శ్యాం.. పూరి డ్రగ్స్ తీసుకోవడం నేను చూశానని.. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ లో చార్మికి, సుబ్బరాజుకు కూడా డ్రగ్స్ ఇచ్చేవాడని.. దానికి డబ్బులేమీ తీసుకునే వాడు కాదని పోలీసుల ఎదుట శ్యాం బాంబు పేల్చినట్టు సమాచారం. దీంతో ఈ లెక్కన పూరియే అసలు దోషి అని ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి..

To Top

Send this to a friend