జైలవకుశపై షాకింగ్ న్యూస్.

దసరా కానుకగా సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఘనంగా సెప్టెంబర్ 3న ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ ఆడియో ఫంక్షన్ ను అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్టు చిత్రం యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. దానికి గల కారణాలను వెల్లడించింది.. ఆడియో ఫంక్షన్ ను రద్దు చేశామని.. గణేష్ నిమజ్జనం, మరో వైపు భారీ వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత కల్యాణ్ రామ్ తెలిపారు.

కానీ సెప్టెంబర్ 3నే ఆడియో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక సినిమా ప్రమోషన్ కోసం ఈనెల 10న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహిస్తామని .. అదే రోజున సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ‘జైలకుశ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తో భారీ హిట్ కొట్టినా ఎన్టీఆర్ మరో సారి విభిన్నమైన కథతో జైలవకుశ సినిమా తీస్తున్నారు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాడు. జై, లవ పేరుతో విడుదల చేసిన టీజర్లకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పుడీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

To Top

Send this to a friend