జక్కన్న నెక్ట్స్‌ మూవీ షాకింగ్‌ వార్త


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం జక్కన్నతో సినిమా చేసేందుకు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ మరియు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం తెలుగు హీరోతోనే తన తర్వాత సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. జక్కన్న తర్వాత సినిమా ఎన్టీఆర్‌ లేదా మహేష్‌బాబుతో ఉండే అవకాశాలున్నాయని మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైన చేయడానికి తాను ఇష్టపడతాను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్టీఆర్‌, రాజమౌళిల కాంబో చిత్రం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. పలు చిత్రాలను కమిట్‌ అయిన ఎన్టీఆర్‌ వచ్చే సంవత్సరం చివరి వరకు జక్కన్నకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్‌బాబుతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పైడర్‌’ చిత్రాన్ని చేస్తున్న మహేష్‌బాబు ఆ వెంటనే ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. సంక్రాంతికే మహేష్‌ ‘భరత్‌ అను నేను’ చిత్రం విడుదల కానుంది. వచ్చే అక్టోబర్‌ లేదా నవంబర్‌లో రాజమౌళి తర్వాత సినిమా ప్రారంభం ఉండే అవకాశం ఉంది. జక్కన్న తర్వాత సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నాడు. జక్కన్న తర్వాత సినిమాకు సంబంధించి ఒక స్టోరీ లైన్‌ ఖరారు అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

To Top

Send this to a friend