షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్‌


మంచు ఫ్యామిలీకి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. మోహన్‌బాబు కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి. ఎన్నో చిత్రాలను చేసి టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒక్కడిగా నిలిచాడు. అటువంటి మోహన్‌బాబు నట వారసులుగా ఆయన ముగ్గురు పిల్లలు కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వారిలో ఒకడే మంచు మనోజ్‌. అప్పట్లో మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలో బాల నటుడిగా నటించిన మంచు మనోజ్‌ దాదాపు పది సంవత్సరాల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన మంచు మనోజ్‌ కమర్షియల్‌ సక్సెస్‌లను మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యాడు. ఆ కారణంగానో లేక మరో కారణంగానో కాని సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు. మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత తాను కమిట్‌ అయిన సినిమాలే తనకు చివరి సినిమాలు అంటూ ప్రకటించాడు. ఫేస్‌బుక్‌ మరియు ట్విట్టర్‌లో అధికారికంగా మంచు మనోజ్‌ ప్రకటించిన నేపథ్యంలో అసలేం జరిగింది అంటూ ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. మనోజ్‌ ఉన్నట్లుండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.

ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్బంగా ప్రజలకు ఏమైనా చేయాలి, రైతులను ఆదుకోవాలనిపిస్తుంది అంటూ మీడియా ముందు మాట్లాడిన మనోజ్‌ ఇతర హీరోలతో కలిసి సాయం చేసేందుకు ముందుకు వస్తాను అంటూ ప్రకటించాడు. ఇంతలోనే ఇలా సినిమాలకు గుడ్‌ బై చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి, కుటుంబ కారణాల లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది, సామాజిక అంశాలపై ఎక్కువ ఆసక్తిని చూపించే మనోజ్‌ రాజకీయాల వైపు అడుగులు వేస్తాడా అనే టాక్‌ కూడా వస్తుంది. మొత్తానికి ఒక మంచి మిత్రుడు సినిమా ఇండస్ట్రీ నుండి దూరం అవుతున్నందుకు చాలా ఇబ్బందిగా ఉందని యువ హీరోలు అంటున్నారు.

To Top

Send this to a friend