ఎంపీ, ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సి.ఎం..

టీడీపీ ఎంపీ మురళీ మోహన్ నిన్న చంద్రబాబును కలిశారు. అంతకుముందే ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. కానీ వీటన్నింటికి చంద్రబాబు చెక్ చెప్పారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు..

టీడీపీ ప్రజాప్రతినిధులకు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు ఇవ్వనని స్పష్టం చేశారు చంద్రబాబు.. నామినేటెడ్ పదవులు కూడా పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులకే కట్టబెడితే.. పార్టీని నమ్ముకొని జీవిస్తున్న ఇతర నేతలకు ఏం ఇవ్వాలని ఎంపీ మురళీ మోహన్ ను చంద్రబాబు ప్రశ్నించారట.. దీంతో మురళీ మోహన్ తాను చంద్రబాబు సూచన మేరకే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు..

పార్టీ కోసం పనిచేసి.. పదవికి అర్హత ఉండి.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి, ప్రజాప్రతినిధులుగా లేని వారికి మాత్రమే టీటీడీ చైర్మన్ సహా ఇతర దేవాదాయ, మార్కెట్ , కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దెబ్బతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల్లో నిరాశ వ్యక్తం కాగా.. పార్టీ ని నమ్ముకొని పదవులు లేని వారికి కొత్త ఆశ వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టీడీపీలో ఉత్సాహం వచ్చింది.

To Top

Send this to a friend