బీజేపీకి షాక్.!


అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సై అంటే సై అంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఇద్దరు దళిత నేతలను బరిలో దించి పోరును రసవత్తరంగా మార్చేశాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. యూపీఏ మిత్రపక్ష 16 పార్టీలతో సమావేశమై కాంగ్రెస్ యూపీఏ పక్షాన దళిత నేత, మాజీ స్పీకర్ మీరాకుమారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు.

ఎన్టీఏ తరఫున మోడీ ప్రయోగించిన దళిత కార్డుకు సోనియాగాంధీ టిట్ ఫర్ టాట్ లా అదే దళిత వర్గానికే చెందిన మాజీ స్పీకర్ మీరాకుమార్ ను నిలబెట్టడంతో రాజకీయాలు రంజుగా మారాయి. ప్రతిపక్షాలన్నీ కలిసి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాదన్నది తేలిపోయింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యంగా మారాయి..

కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు 16 ప్రాంతీయ పార్టీలు మీరాకుమారిని బలపర్చాయి. మీరా తెరమీదకు రావడంతో కోవింద్ కంటే కూడా ఈమె బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 48శాతం ఓట్లుండగా.. యూపీఏ కాంగ్రెస్ కు 35శాతం ఉన్నాయి. అన్నాడీఎంకే , టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రాష్ర్టపతి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఆ చిన్న పార్టీలే రాష్ట్రపతిని డిసైడ్ చేయనున్నాయి.

కాంగ్రెస్, బీజేపీలు దళిత కార్డును తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. కోవింద్ కంటే మీరా మెరుగైన అభ్యర్థి కావడంతో ఎన్డీఏలోని కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడవచ్చనే ఆందోళన బీజేపీలో మొదలైంది.. కోవింద్ పట్ల కూడా ఎన్డీఏలో కొంత వ్యతిరేకత ఉంది. అడ్వాణీని కాదని కోవింద్ ఎంపిక చేయడంతో కొందరు బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఈ లెక్కన మీరా కుమార్ కు, కాంగ్రెస్ ఈ బీజేపీలోని అంసతృప్తి అంశాలు కలిసివచ్చేలా కనిపిస్తున్నాయి.

To Top

Send this to a friend