షాక్‌ : ‘దంగల్‌’ 2 వేల కోట్లు కాదు!


అమీర్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం రెండు వేల కోట్లను వసూళ్లు చేసింది అంటూ గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘దంగల్‌’ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఒకటి ‘దంగల్‌’ చిత్రం రెండు వేల కోట్లను వసూళ్లు చేసింది అంటూ ఒక కథనం రాసింది. దాంతో అంతా కూడా కనీవినీ స్థాయిలో దంగల్‌ వసూళ్లు రాబట్టిందని అనుకున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు కలెక్షన్స్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్నట్లుగా ఇప్పటి వరకు ‘దంగల్‌’ చిత్రం రెండు వేల కోట్ల మార్క్‌ను చేరుకోలేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు1900 కోట్లకు దగ్గర్లోనే ‘దంగల్‌’ చిత్రం ఉందని చైనాలో కలెక్షన్స్‌ డ్రాప్‌ అయిన నేపథ్యంలో రెండు వేల కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరుతుందనే నమ్మకం లేదు అంటూ స్వయంగా అమీర్‌ ఖాన్‌కు సంబంధించిన ఒక వ్యక్తి బాలీవుడ్‌ మీడియాకు సందేశం పంపించాడు.

ఇన్ని రోజులుగా ‘దంగల్‌’ చిత్రం 2000 వేల కోట్లను క్రాస్‌ చేసిందని భావిస్తున్న ప్రేక్షకులు పప్పులో కాలేశామే అనుకుంటున్నారు. మరో వైపు ‘బాహుబలి 2’ చిత్రం ‘దంగల్‌’ చిత్రాన్ని క్రాస్‌ చేసి త్వరలోనే రెండు వేల కోట్ల మార్క్‌ను అందుకోవాలని ఆసక్తిగా ఉంది. వచ్చే నెలలో చైనాలో ‘బాహుబలి 2’ చిత్రం చైనాలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు ఖచ్చితంగా దంగల్‌ రికార్డులను బ్రేక్‌ చేయడం ఖాయం.

To Top

Send this to a friend