ధన్ రాజ్ ను కొట్టిన శివబాలాజీ

గురువారం రాత్రి బిగ్ బాస్ షోలో తాప్సీ సందడి చేసింది. సెలెబ్రెటీలకు టాస్క్ ఇచ్చి నటీనటులను చేసింది. ఇందులో జేజమ్మగా దీక్ష బాగా చేసింది. మిగతా వారందరూ తమ తమ వేశాల్లో ఒదిగిపోయారు. ఇక ఈ మధ్యలోనే దీక్షపై ధనరాజ్ నోరుజారడం వివాదాస్పదమైంది. దీక్షను నువ్ ‘స్పిట్ పర్సనాలిటీ’ అని అనడంతో ఆమె ఏడుస్తూ బెడ్ రూంకు వెళ్లింది. దీక్షను ఓదార్చడానికి వెళ్లిన శివబాలాజీ ఆమె ముందే ధన్ రాజ్ చెంప చెళ్లు మనిపించారు. దీనిపై అందరూ శివబాలాజీని ఎలిమినేట్ చేయాలని పట్టుపట్టారు. చివరకు దీక్ష కూల్ అయ్యింది. కానీ ఇదంతా నాటకం అని తేలడంతో నవ్వుకుంది.

శుక్రవారం రాత్రి జరగబోయే బిగ్ బాస్ పై ప్రోమో ఆసక్తి రేపుతోంది. అందులో ఇంటి కొత్త కెప్టెన్ ఎవరో డిసైడ్ కానుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ గేమ్ ను ఆడించి అందులో విజేతలకు కెప్టెన్సీ పదవి ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. తలా కొన్ని కోడిగుడ్లు ఇచ్చి వాటిని ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారికే కెప్టెన్ పదవి అని ప్రకటించాడు. దీనికోసం కంటెస్టెంట్లందరూ కొట్టుకోవడం కనిపించింది. ఈ పెనుగాలటలో ముమైత్, అర్చన, హరితేజ, మహిళా సభ్యులకు గాయాలు అయినట్టు చూపించారు.దీంతో ఈ శుక్రవారం రాత్రి బిగ్ బాస్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఊపేస్తోంది.

వీకెండ్ దగ్గరకు వస్తుండడంతో బిగ్ బాస్ లో కాస్త వేడి పెరిగింది. నవదీప్ వచ్చాక సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రణాళిక బద్ధంగా బిగ్ బాస్ షో ముందుకెళ్తోంది. రోమాంటిక్, వెగటు పుట్టించే టాస్క్ లను సెలబ్రెటీలకు ఇస్తూ వినోదం పంచుతున్నారు. గురువారం రాత్రి కూడా అలాంటి టాస్క్ లే ఇచ్చారు. నిన్నటి షోలో శివబాలాజీ బిగ్ బాస్ ను, ఆ షో నిర్వాహకులను బండబూతులు తిట్టాడు. బాత్రూంలో మురికినీళ్లు రావడంతో శివాలెత్తాడు. కనీసం మంచినీళ్లు ఇవ్వరా.. డబ్బులు తీసుకుంటున్నారు గా అని మండిపడ్డాడు.. పుణె లోని బిగ్ బాస్ ఇళ్లు కొండ ప్రాంతాల మధ్యన ఉందని.. భారీ వర్షాల కారణంగా ఇలా జరిగిందని బిగ్ బాస్ వల్లకు సూచించాడు.

To Top

Send this to a friend