బాహుబలిని క్రాస్‌ చేయడం సాధ్యం.

బహుబలి రెండు పార్ట్‌లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మొదటి పార్ట్‌ 650 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక రెండవ పార్ట్‌ దాదాపు 1600 కోట్లను వసూళ్లు చేసింది. రెండు పార్ట్‌లను కలిపి 2300 కోట్లు వసూళ్లు చేసింది. ఇంతటి సంచలన వసూళ్లు సాధించిన సినిమాను బీట్‌ చేయడం మరెవ్వరికి సాధ్యం కాదని అంతా భావిస్తున్నారు. అయితే శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘2.0’ చిత్రం ఆ రికార్డును బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు కొందరు అంటున్నారు. శంకర్‌ అద్బుత సృష్టి ‘2.0’ చిత్రం రికార్డులను బ్రేక్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శంకర్‌ ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రజినీకాంత్‌ హీరోగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ‘రోబో’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు. దాంతో ఖచ్చితంగా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా తెలుస్తోంది. హాలీవుడ్‌ సినిమా స్థాయిలో భారీగా విడుదల చేయనున్న నేపథ్యంలో కలెక్షన్స్‌ పంట పండటం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాను చైనాలో భారీగా విడుదల చేస్తామని అంటున్నారు. దాంతో బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

To Top

Send this to a friend