మహేశ్, రాంచరణ్ లనే తిట్టాడే..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మరో లవ్ స్టోరీ ‘ఫిదా’. తెలంగాణ అమ్మాయికి, అమెరికా అబ్బాయికి మధ్య కుదిరే ప్రేమ. ఆద్యంతం పల్లెటూరులో, అమెరికాలో సాగిన ఈ ప్రేమకథలో హీరోయిన్ సాయి పల్లవి చెలాకీ నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ పల్లవి తెలంగాణ యాసను నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పిందట.. నూతన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు అందించిన సంగీతం సూపర్ గా ఉంది. ఈ సినిమా రిలీజ్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శేఖర్ కమ్ముల… టాలీవుడ్ అగ్ర హీరోలు మహేశ్ బాబు, రాంచరణ్ ల గురించి పలు వివాదాస్పద కామెంట్లు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

లీడర్ కథను మొదట హీరో మహేశ్ బాబుకు వినిపించానని.. అతడు చేయను అనడంతో రానాతో తీశానన్నారు. ఆ తర్వాత ఫిదా కథను కూడా మహేశ్ బాబుకు వినిపిస్తే దీనికి ఒప్పుకోలేదన్నారు. ఆ తర్వాత రాంచరణ్ కు కూడా ఫిదా కథ వినిపిస్తే ఆసక్తి చూపించలేదన్నారు.

కానీ ఈ కథ హిట్టయ్యిందని శేఖర్ కమ్ముల చెప్పకొచ్చారు. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని.. వారికి అనుగుణంగా తాను నేచురల్ కథలు రాసి అగ్ర హీరోలు వినిపిస్తే వారు చేయనన్నారని.. స్టార్ హీరోల కోసం తాను కథలు రాయనని.. మంచి కథ ఉంటేనే హీరోలను సంప్రదిస్తానని చెప్పారు. ఇంకా ఇమేజ్ చట్రంలోనే మన అగ్రహీరోలు బందీ అయిపోయి కొత్త కథలు చేయడం లేదని శేఖర్ కమ్ముల సంచలన ఆరోపణలు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

To Top

Send this to a friend