శంకరాభరణంకు ఆధరణ దక్కేనా?

కొన్ని సంవత్సరాల క్రితం సినిమా ప్రముఖులకు జాతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అవార్డులు ఇచ్చేవి. ప్రతి ఇండియన్‌ సినిమా టెక్నీషియన్‌ లేదా నటీ నటులు జాతీయ అవార్డును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా అవార్డు వేడుకలు మరీ ఎక్కువ అయ్యాయి. ప్రతి ఛానల్‌ మరియు మ్యాగజైన్‌లు అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టాయి.

ప్రస్తుతం ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా, స్టార్‌మా అవార్డులు, సంతోషం అవార్డులు ఇలా ఎన్నో అవార్డు వేడుకలు జరుగుతున్నాయి. అవే కాకుండా అల్లు రామలింగయ్య, అక్కినేని నాగేశ్వరరావు ఇలా ప్రముఖుల పేర్ల మీద అవార్డులు ఇస్తున్నారు. ఇన్ని అవార్డులు ఉండగా కొత్తగా శంకరాభరణం అనే అవార్డులు తెరపైకి వచ్చాయి. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాధ్‌ పేరు మీద ఆయన శిష్యురాలు అయిన సీనియర్‌ నటి తులసి ఈ అవార్డులను ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళం సినీ పరిశ్రమలకు ఈ అవార్డులను ఇవ్వబోతున్నట్లుగా ఆమె ప్రకటించారు. నేడు మొదటి శంకరాభరణం అవార్డు వేడుక జరుగబోతుంది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమంను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగు నుండి ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌, తమిళం నుండి ఉత్తమ నటుడిగా ధనుష్‌, హిందీ నుండి ఉత్తమ నటుడిగా ఆమీర్‌ ఖాన్‌లు అవార్డులను అందుకోబోతున్నారు. అయితే ఈ అవార్డు వేడుకలకు సెలబ్రెటీలు వస్తారా, సక్సెస్‌ అయ్యేనా అనేది అనుమానంగానే ఉంది. ఉత్తమ నటుడు అవార్డును అందుకునేందుకు ఎన్టీఆర్‌ వస్తాడా అనేది కూడా అనుమానమే అంటున్నారు. శంకరాభరణం పేరు మీద అన్ని పరిశ్రమల చెందిన ఉత్తమ దర్శకుల వరకు అవార్డులు ఇస్తే సరిపోయేది, సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్‌ల వారికి అవార్డులు ఇవ్వడం అంటే ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend