శంకరాభరణం ఫ్లాప్‌.. ఆయన పరువు తీశారు


కళాతపస్వీ కే విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘శంకరాభరణం’ చిత్రంతో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తులసి తాజాగా ఆయన పేరు మీద ‘శంకరాభరణం’ అంటూ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలకు చెందిన 24 క్రాప్ట్స్‌ వారికి అవార్డులను ఇస్తానంటూ ప్రకటించింది. తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శంకరాభరణం అవార్డు వేడుక జరిగింది. ఈ అవార్డు వేడుకలో ఏ ఒక్క స్టార్‌ కూడా పాల్గొనలేదు.

ముందు నుండి అనుకున్నట్లుగానే ఈ అవార్డు వేడుకలకు స్టార్స్‌ రాకపోవడం మీడియాను పెద్దగా ఆశ్చర్యంకు గురి కాలేదు. అయితే ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ అవార్డును అందుకునేందుకు వస్తాడు అని అంతా భావించారు. కాని ఎన్టీఆర్‌ కూడా అవార్డును అందుకునేందుకు వేడుకకు రాలేదు. అవార్డులు పొందిన వారు కూడా ఈ వేడుకకు రాక పోవడంతో అట్టప్‌ ఫ్లాప్‌ అయ్యిందని మీడియా వారు అంటున్నారు.

ప్రస్తుతం తెలుగులో పలువురు అవార్డులు ఇస్తున్నారు. ఇంకా కొత్తగా అవార్డు వేడుకలు చేయాలి అంటే ప్రస్తుతం చేస్తున్న వారికంటే భారీగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించగలరు.  స్టార్ హిరోలు పేపర్లో ప్రేమను విపరీతంగా కురిపిస్తారు స్వయంగా విస్వనధుడే వున్న సభలో స్టార్స్ గానీ కనీసం అవార్డు గ్రహీతలు కూడా హజరవకుండా కళాతపస్విని అవమానపరిచారు ఆయన పరువు తీశారు. ముందు ముందు ఈ అవార్డు వేడుక ఉంటుందనే నమ్మకం లేదు.

 

To Top

Send this to a friend