బిగ్ బాస్ నుంచి సెక్సీస్టార్ ఔట్

సెక్సీ స్టార్, సెక్సీ బాంబ్ పేర్లు ఏవైనా ఆమె మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి తొలివారమే ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్, బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోరిక మేరకు ఈ ఆదివారం బిగ్ బాస్ నుంచి ఆమె వైదొలిగారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. ఉన్న 14మంది సెలబ్రెటీలలో ఐదుగురిని బిగ్ బాస్ తోపాటు ప్రేక్షకులు ఎలిమినేషన్ కు నామినేట్ చేశారు. ఆ ఐదుగురిలోంచి సేఫ్ జోన్ లో ఉన్న ముగ్గురిని హోస్ట్ ఎన్టీఆర్ ఎలిమినేషన్ నుంచి తప్పించి విముక్తి కల్పించారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఆదివారం రాత్రి ఒక్కరు ఎలిమినేట్ అయ్యారు. షో నుంచి బయటకు వచ్చారు..

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అయిన ‘జ్యోతి, మహేశ్ కత్తి, హరితేజ, మధుప్రియ, కత్తి కార్తీకలు ’లు ఐదుగురు ఎలిమినేషన్ అయ్యేందుకు ఆదివారం నామినేట్ అయ్యారు. అందులోంచి ఒకరిని బయటకు పంపించడానికి హోస్ట్ ఎన్టీఆర్ నిర్ణయించారు.. ప్రేక్షకుల ఓటింగ్ మేరకు ఇందులోంచి హరితేజ, మదుప్రియ, కత్తి కార్తీకలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇక మిగిలిన మహేశ్ కత్తి, జ్యోతిలలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నిన్నరాత్రి తతంగం జరిగింది.

బిగ్ బాస్ లోని అందరూ కంటెస్టెంట్ లు, ప్రేక్షకుల ఓటింగ్ మేరకు నటి జ్యోతిని తొలి వారం బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు పంపించారు.. జ్యోతిని బయటకు పంపడానికి గల కారణాలను హోస్ట్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా వీడియోలు చూపిస్తూ వివరించారు. మిగతా 13 మంది బిగ్ బాస్ లో జ్యోతిపై ఎన్నో కామెంట్లు చేశారు. ‘‘ఈ సెక్సీ లేడీ జ్యోతి ప్రవర్తన బాగాలేదని.. ఆమె హౌస్ లో కూడా నటిస్తోందని విమర్శించారు. ఇక జ్యోతి పనిదొంగ అని ఆమె పనిచేయడం లేదని హౌస్ మేట్స్ ఆరోపించారు. ప్రతిదానికి మిగతా వారిని డామేనట్ చేస్తోందని.. ఆమె సెక్సీ చేష్టలు ఎక్కువైపోయాయని బిగ్ బాస్ కు మిగతా కంటెస్టెంట్ లు ఫిర్యాదు చేశారు.’’ అని ఎన్టీఆర్ జ్యోతికి వివరించారు. ఇలా సెక్సీ లేడీ జ్యోతి కథ తొలివారానికే ముగిసిపోయి బిగ్ బాస్ షోను రక్తికట్టించింది.

To Top

Send this to a friend