రోబో2లో రోబోట్స్ సెక్స్.. కీలక పాయింట్..

త్వరలోనే రాబోయే రజినీకాంత్-శంకర్ కలయికలోని ‘రోబో2’ సినిమాలో కూడా రోబోట్స్ శృంగారం అనే టాపిక్ కథలో ఉన్నట్టు సమాచారం. ఇదే పాయింట్ తో సినిమా మలుపుతిరుగుతుందని.. ఓ లేడీ రోబోతో సెక్స్ చేసే సన్నివేశాలున్నాయని చైన్నై వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

సినిమాల్లోనే కాదు.. ఇప్పటికే కొంతమంది సంపన్నులు రోబోలను తయారు చేసుకొని తమ సెక్స్ వాంచలకు ఉపయోగించుకుంటున్నారు. మనుషులు బిజీగా మారిన నేపథ్యంలో రోబోట్ లే వారికి స్వాంతన చేకూరుస్తున్నాయట.. పగలూ రాత్రి తేడా లేకుండా పనిచేయడం.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతున్నారు. శారీరక శ్రమ తగ్గి, మానసిక శ్రమ ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో అనుబంధాలకు దూరమవుతున్నారు. మానవ మనుగడకు కీలకమైన సెక్స్ కు కూడా దూరమైపోతున్నారు.

పనిరాక్షసులుగా పేరుగాంచిన జపాన్ లో కనీసం నెలకు ఒక్కరోజు కూడా సెక్స్ చేసుకోని దంపతులున్నారని ఓ పరిశోధనలో తేల్చింది. ఇక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాల్లోని దంపతులు సంసార సుఖానికి దూరంగా బిజీగా గడుపుతున్నారు.వీరి అవసరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు మానవుల లైంగిక కోర్కెల తీర్చేందుకు మనుషులను పోలిన రోబోట్ లను తయారు చేస్తున్నారు. వీటితో తమ శృంగార వాంఛలను తీర్చుకోవచ్చని చెబుతున్నారు.

మగ, ఆడ రోబోట్ లను తయారు చేసి విక్రయించేందుకు చైనా, జపాన్, అమెరికాన్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. 2030 వరకు ఇవీ అందరికీ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. సో ఏది ఏమైనా రోబోట్స్ తో సెక్స్ కు మానవ సమాజం ఎంతో దూరంలో లేదనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది.

To Top

Send this to a friend