సెన్సార్‌ క్లీయర్‌, ఇక ముందుంది అసలు కథ!


అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బ్రహ్మణులను కించపర్చే సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే బ్రహ్మణ సంఘాల నాయకులు ఆ సన్నివేశాలను తొలగించి సెన్సార్‌ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

బ్రహ్మణ సంఘాల విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోకుండానే ‘డీజే’ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని తేల్చింది. దాంతో బ్రహ్మణ సంఘాలు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అల్లు అర్జున్‌ బ్రహ్మణుడిగా ఉండి కొన్ని చేయకూడని పనులు చేశాడనే సమాచారం ఉంది.

ఆ సీన్స్‌ను తొలగించాల్సిందే అంటూ బ్రహ్మణ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్‌ అండ్‌ టీం మాత్రం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటన్నారు. బ్రహ్మణ సంఘాలు చిత్రాన్ని విడుదల కానిచ్చేది లేదు అని, విడుదలైన తర్వాత కూడా అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ‘డీజే’కు అన్ని విధాలుగా ఫుల్‌ పబ్లిసిటీ వివాదం వల్ల వస్తుంది.

To Top

Send this to a friend