పనికిమాలిన పనికి పరువు పోయింది


మంచు హీరో మనోజ్‌ తన కొత్త సినిమా అనౌన్స్‌ చేయడం కోసం, కాస్త పబ్లిసిటీ దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో నిన్న ఉదయం తాను సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లుగా సీరియస్‌గా పోస్ట్‌ చేశాడు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌ చేయడంతో అంతా కూడా అవాక్కయ్యారు. ఈ విషయం జాతీయ మీడియాలో కూడా చర్చకు రావడంతో మోహన్‌బాబు క్లాస్‌ పీకడం, ఆ వెంటనే మనోజ్‌ సదరు పోస్ట్‌లను డిలీట్‌ చేయడం జరిగింది. పబ్లిసిటీ కోసం ఇంత చీప్‌గా వ్యవహరించడం ఏంటని మోహన్‌బాబుతో సహా సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.

మంచు మనోజ్‌ చేసింది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని, మీడియాతో పాటు ఆయన సన్నిహితులను, స్నేహితులను, ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేసినట్లయ్యింది. ఒక సినిమా ప్రమోషన్‌ కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే అందులో చెత్త మార్గాలు కూడా ఉంటాయి. చెత్త మార్గంలో వర్మ వంటి వారు ప్రమోషన్‌ చేస్తారు. అది కొందరికే వర్కౌట్‌ అవుతుంది. ఇలా కొత్త వారు చెత్త మార్గాల ద్వారా పబ్లిసిటీ పొందాలని భావిస్తే ఇలాగే అవుతుందని మనోజ్‌ ఉదంతం తర్వాత అందరికి అర్థం అయ్యింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా, వెబ్‌ మీడియా ఏ స్థాయిలో పని చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సెలబ్రెటీలు ఏ చిన్న పోస్ట్‌ చేసినా, ఏ చిన్న కామెంట్‌ చేసినా కూడా అది ఎంతగా ప్రభావం చూపుతుందో ముందే ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మంచు మనోజ్‌ బాబు కాస్త జాగ్రత్తగా ఉంటాడని భావిద్దాం.

To Top

Send this to a friend