బిగ్‌బాస్‌ షో.. ఒక చెత్త షో అంది

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుల్లి తెర కార్యక్రమం బిగ్‌ బిస్‌ షో గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఉత్తరాది ప్రేక్షకులు మాత్రమే బిగ్‌ బాస్‌ షోకు ఫ్యాన్స్‌. ఇప్పుడు సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడంలో కూడా బిగ్‌ బాస్‌ షోను ప్రారంభించారు. ఇప్పటికే తమిళం మరియు కన్నడంలో షో ప్రారంభం అయ్యింది. అక్కడ ప్రేక్షకులను అరిస్తుంది. అయితే కొందరు ఈ షోపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

ఆడ మగ ఏ సంబంధం లేకుండా ఒక్క ఇంట్లో 70 రోజులు ఉండటం ఏంటి, ఇదో చెత్త కాన్సెప్ట్‌, ఇలాంటి షోలను ఎంకరేజ్‌ చేయవద్దని అంటున్నారు. తాజాగా తమిళ ప్రముఖ నటి, దర్శకురాలు లక్ష్మి రామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ప్రారంభం అయిన తమిళ బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాల్సిందిగా ఆమెను కోరారట. అందుకు ఆమె సీరియస్‌గా నో చెప్పిందట. దాంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేసింది.

బిగ్‌ బాస్‌ షోలో తాను 10 కోట్లు ఇచ్చిన పాల్గొనను అని చెప్పుకొచ్చింది. అలాంటి చెత్త షోను కనీసం చూడను కూడా చూడను అంటూ విమర్శ చేయడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. తెలుగులో కూడా ఎన్టీఆర్‌ ఈ షోను చేస్తున్న కారణంగా ఆ వ్యాఖ్యలు ఇక్కడ కూడా చక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌ బాస్‌ చేయడం వల్ల కమల్‌ నష్టపోవాల్సి వస్తుందని, కమల్‌ ఒక చెత్త షోకు హోస్ట్‌గా చేస్తున్నాడని మరి కొందరు కూడా విమర్శలు చేస్తున్నారు.

To Top

Send this to a friend