ఆమెతో సెల్ఫీ కోహ్లీ డకౌట్, ఇండియా ఓటమి

యాదృశ్చికంగా జరిగిన ఈ సంఘటనే అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. పాకిస్తాన్ స్పోర్ట్ ఎనలిస్టు జైనాబ్ అబ్బాస్ తో సెల్ఫీ దిగిన విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఇద్దరు ఆ మ్యాచ్ ల్లో డకౌట్ అయ్యారు. అదే మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికాలు శ్రీలంక, పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. దీంతో జైనాబ్ సెల్ఫీలే తమ జట్ట కొంప ముంచాయని భారత, దక్షిణాఫ్రికా అభిమానులు మండిపడుతున్నారు.

గడిచిన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ ఇంతవరకు డకౌట్ అయిన చరిత్ర లేదు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు డివిలియర్స్ సోర్ట్స్ జర్నలిస్టుతో సెల్ఫీదిగాడు. ఆ మ్యాచ్ లో డకౌట్ అయ్యి వెనుదిరిగాడు.. శ్రీలంకతో మ్యాచ్ కు ముందు విరాట్ తో కూడా జర్నలిస్టు సెల్ఫీ దిగింది. భారత కెప్టెన్ సైతం మూడేళ్లలో తొలిసారి డకౌట్ అయ్యాడు.

ఇలా ఈ జర్నలిస్టు ఎవరితో సెల్ఫీ దిగితే వారు డకౌట్ అవుతారని.. వారి టీం ఓడిపోతుందనే అపవాదు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. పాకిస్తాన్ అభిమానులు మాత్రం జైనాబ్ సెల్ఫీలు దిగి ఇలా ప్రత్యర్థి టీంలను ఓడగొట్టాలని అభిమానులు కోరుతున్నారు.

To Top

Send this to a friend