ఎస్బీఐ ఖాతాదారులకు ఇది షాకే..

భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. వివిధ రకాల సర్వీస్ చార్జీల్లో మార్పులు చేసింది. జూన్ 1 నుంచి అమలైన ఈ కొత్త చార్జీలు వినియోగదారులపై భారం మోపుతున్నాయి..

ఎస్బీఐ ఖాతాదారులు మెట్రోనగరాల్లో ఇంత వరకు ఏటీఎంలలో మూడు సార్లు మాత్రమే తీసుకునేందుకు ఫ్రీ ఉండేది.. కానీ ఇప్పుడా పరిమితిని 5కు పెంచారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు సార్లు ఫ్రీగా డబ్బు తీసుకోవచ్చు. అంతకుమించి ఎస్బీఐ ఏటీఎం నుంచి నగదు తీస్తే ఒక్కో లావాదేవీకి 10+సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి నగదు తీస్తే రూ.20+సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు.

ఇక సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారులు తమ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకునే పరిమితిపై మాత్రం ఎస్బీఐ కొరఢా ఝలిపించింది. నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా తమ ఖాతాల్లోంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అంతకుమించితే.. ఒక్కో లావాదేవీపై 50 రూపాయలతోపాటు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు.

ఇక ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపితే కూడా సర్వీస్ చార్జితో పాటు రూ.5 వసూలు చేస్తారు. లక్ష నుంచి 2 లక్షలలోపు రూ.15తోపాటు సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. ఇక 2లక్షలకు మించితితే రూ.25+సర్వీస్ టాక్స్ కట్టాల్సిందే..

ఇక చెక్ బుక్కులకు సైతం ఇన్నాళ్లు ఫ్రీగా ఇచ్చేవారు ఇప్పుడు పది చెక్ లు ఉన్న చెక్ బుక్ కు రూ.30+సర్వీస్ టాక్స్, 25 లీఫ్ లు ఉన్న చెక్ బుక్ కోసం 75రూపాయలు+సర్వీస్ ట్యాక్స్ 50 లీఫ్ లకు 150 రూపాయలు+సర్వీస్ టాక్స్ వసూలు చేస్తామని ఎస్ బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పరిణామాలతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, అతి ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులు గల ఎస్ బీఐపై నమ్మకం పోతోంది. ఖాతాదారులు చాలా మంది డబ్బులు ఒకే సారి తీసుకోవడమో లేక ఖాతానే రద్దు చేసుకోవడమో చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులకు ఉచితంగా పలు సర్వీసుల్లో సేవలందించాలని ఖాతాదారులు కోరుతున్నారు.

To Top

Send this to a friend