SBI ‘ఆన్ లైన్’ చార్జీలు తగ్గింపు

 

 
 
మొన్ననే ఆన్ లైన్ చార్జీలు పెంచి దేశవ్యాప్తంగా విమర్శలు కొనితెచ్చుకున్న దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్.బీ.ఐ ఇప్పుడా తప్పును సవరించుకుంది. జూలై 15నుంచి అంటే రేపటినుంచి ఆన్ లైన్ చార్జీలను భారీగా తగ్గించింది. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్న ప్రధాని మోడీ సంకల్పానికి అనుగుణంగా రేట్లను తగ్గించినట్లు ఎస్.బీ.ఐ పేర్కొంది.  ఎస్.బీ.ఐ ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలను భారీగా తగ్గించింది. ఇక నుంచి నెఫ్ట్, ఆర్.టీ.జీ.ఎస్ చార్జీలను 75శాతం వరకు తగ్గించింది. ఈ నిర్ణయాన్ని జూలై 15 శనివారం నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఆన్ లైన్ బ్యాంకింగ్ వాడుతున్న 5.27 కోట్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది..
 

వారం క్రితం ఎస్.బీ.ఐ ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే భారీగా ధరలు పెంచింది. దీనిపై దేశవ్యాప్తంగా కస్టమర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.  ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో పీకల్లోతూ విమర్శలు తెచ్చుకున్న బీజేపీ పెద్దలకు ఇలా ఎస్.బీ.ఐ ఆన్ లైన్ చెల్లింపుల ధరలు పెంచడం శరాఘాతమైంది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ ప్రభుత్వం ఎస్.బీ.ఐ ఆన్ లైన్ ధరలు తగ్గించేలా బ్యాంకు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో ఎస్.బీ.ఐ వెనక్కి తగ్గింది.  అయితే కింది చార్జీలతో సేవ పన్ను జీఎస్టీని 18శాతం పన్ను సేవలపై ఉంటుందని చెప్పి చివర్లో ఎస్.బీ.ఐ చిన్న మెలిక పెట్టింది.

 
* ఆన్ లైన్ చార్జీల తగ్గింపు ధరలు ఇవీ..
 ఎస్.బీ.ఐ తగ్గించిన నెఫ్ట్, ఆర్.టీ.జీ.ఎస్ చార్జీలు ఇలా ఉన్నాయి..
* నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే రూ.10,000 వరకు చార్జీ  రూ.1
* రూ.10,001 నుంచి లక్ష వరకు  చార్జీ  రూ.2
* రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు రూ. 3 (గతంలో ఈ ధర 12 రూపాయలు ఉండేది..)
* రూ. 2 లక్షలు మించితే  రూ. 5 చార్జి (గతంలో ఈ చార్జి రూ.20 ఉండేది)
 
ఇక ఆర్.టీ.జీ.ఎస్ ద్వారా డబ్బు పంపిస్తే చార్జీలు..
* రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు – రూ. 5 (గతంలో చార్జీ రూ. 20)
*రూ. 5 లక్షల నుంచి ట్రాన్స్ ఫర్ చేస్తే – రూ. 10 (గతంలో ఈ చార్జీ 40 ఉండేది)
 
రేపటి నుంచి ఎస్.బీ.ఐ ఖాతా నుంచి ఐఎంపీఎస్ ద్వారా రూ.1000 వరకు డబ్బులు పంపిస్తే ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపింది.

To Top

Send this to a friend