ఎస్.బీ.ఐ దోపిడి..


ఏప్రిల్ 1 నుంచి ఎస్.బీ.ఐ ఖాతాల్లో మెట్రో నగరాల్లో రూ.5వేలు.. నగరాల్లో రూ.3 వేలు.. పట్టణాల్లో రూ.2 వేలు, గ్రామాల్లో రూ.1000 తప్పనిసరిగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతమొత్తం ఖాతాల్లో ఉంచడం లేని ఖాతాదారులు ఖాతాను రద్దు చేసుకునేందుకు ఎస్.బీ.ఐల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా ఖాతా రద్దు చేసుకునే వారికి రూ.575 జరిమానా వసూలు చేస్తుండడం ఖాతాదారులను దిగ్ర్భాంతికి గురి అవుతున్నారు. దాంతోపాటు వ్యాపారులు నిర్వహించే కరెంట్ అకౌంట్ రద్దు చేయదలుచుకునే వారికి రూ.1000 జరిమానా వసూలు చేస్తుండడం కూడా ఆగ్రహానికి గురిచేస్తోంది..

పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు విశేష అధికారులు, సవాలక్ష నిబంధనలు పెట్టి ఖాతాదారులు ఉసురు తీస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్.బీ.ఐ ఇలా ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాలని నిబంధన విధించడంతో ఖాతాదారులు మండిపడుతున్నారు. జీరో ఖాతాలు ఇవ్వాలని బ్యాంకుల సేవలను సరళం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.

To Top

Send this to a friend