పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న “సత్యా గ్యాంగ్”

మన కోసం మనం బ్రతకడం కాదు.. పదిమంది కోసం బ్రతకాలి” అనే నినాదానికి పుష్కలమైన వినోదం జోడించి రూపొందుతున్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సత్యా గ్యాంగ్”. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రభాస్ నిమ్మలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అభిరుచి గల నిర్మాత మహేష్ ఖన్నా నిర్మిస్తున్న “సత్యా గ్యాంగ్” పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది. చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషిస్తోండడం విశేషం. ప్రథ్యూస్, సాత్విక్ హీరోలుగా.. హర్షిత పన్వార్, అక్షిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఖన్నా, జీవా, షఫీ, కాలకేయ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


సిద్ధయోగి క్రియేషన్స్ అధినేత-చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. “ఓ చక్కని సందేశానికి చిక్కని వినోదం జోడించి తెరకెక్కిస్తున్న “సత్యా గ్యాంగ్” చిత్రాన్ని మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఎంతో నిబద్ధతతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న తమ స్నేహితుడి కోసం అతని మిగతా స్నేహితులు ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. నేను కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. నటుడిగా, నిర్మాతగా నాకు మంచి గుర్తింపు ఇస్తుందని నమ్ముతున్నాను. పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. బ్యాంకాంక్ లో పాటలు షూట్ చేయనున్నాం” అన్నారు.
చిత్ర దర్శకులు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. “నన్నూ, నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మహేష్ ఖన్నాగారిని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయన ప్రోత్సాహంతోనే “సత్యా గ్యాంగ్” చాలా బాగా వస్తోంది. ప్రథ్యూస్, సాత్విక్, హర్షిత, అక్షితలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక సుమన్, కాలకేయ ప్రభాకర్, జీవా, షఫీ వంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది” అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: చంద్రబోస్, నిర్మాత: మహేష్ ఖన్నా, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల !!

To Top

Send this to a friend