శ‌రీరంలో ఐర‌న్ లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ (ఇనుము) కూడా ఒక‌టి. ఐర‌న్ ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తింటేనే మ‌న‌కు ర‌క్తం ఎక్కువ‌గా పెరుగుతుంది. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి. అయితే మ‌న శ‌రీరంలో ఐర‌న్ త‌క్కువైతే కేవ‌లం ర‌క్త హీనత మాత్ర‌మే కాదు, ఇంకా ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అవేమిటంటే…

1. ఐర‌న్ లోపం వ‌ల్ల తీవ్ర అల‌స‌ట ఉంటుంది. చిన్న చిన్న ప‌నుల‌కే ఎక్కువగా అల‌సిపోతారు. అల‌స‌ట‌తో పాటు చికాకు, బ‌ల‌హీనంగా మార‌డం, ఏకాగ్ర‌త కుద‌ర‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

2. రోజువారీ ప‌నులు చేస్తున్నా శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపిస్తుంటుంది.

3. నిద్ర‌లో కాళ్లు అదేప‌నిగా క‌దుపుతుండ‌డం, మ‌ధ్య‌మ‌ధ్య‌లో గోకుతుండ‌డం ఐర‌న్ లోపానికి సంకేతంగా చెప్ప‌వ‌చ్చు.

4. మెద‌డులోని ర‌క్త‌నాళాలు ఉబ్బి త‌ల‌నొప్పిగా ఉంటుంది.

5. చిన్న‌పిల్ల‌లు చాక్‌పీస్‌, మ‌ట్టి, కాగితాలు వంటివి తింటుంటే ఐర‌న్‌లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి.

6. ఐర‌న్‌లోపం ఉన్న‌వారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విష‌యాల‌కూ తీవ్రంగా ఆందోళ‌న చెందుతుంటారు.

7. ఐర‌న్ లోపం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మంద‌గిస్తుంది. దానివ‌ల్ల హైపోథారాయిడిజమ్ అనే స‌మ‌స్య త‌లెత్త‌వ‌చ్చు. త్వ‌ర‌గా అల‌సిపోతుండ‌డం, బ‌రువు పెరుగుతుండ‌డం, శ‌రీరం చ‌ల్ల‌గా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

8. ఐర‌న్‌లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని ముందే చెప్పుకున్నాం. దానివ‌ల్ల జుట్టు ఊడిపోతుంది.

9. నాలుక మంట పుట్ట‌డం, వాపు చాలా నున్న‌గా మార‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

10. చ‌ర్మం పాలిపోతుంది. పెద‌వుల లోప‌లి భాగంలో, చిగుళ్లు, క‌నురెప్ప‌ల లోప‌ల కూడా ఎరుపుద‌నం తగ్గుతుంది.

ఐర‌న్ ల‌భించాలంటే…
ఐర‌న్ లోపం త‌లెత్త‌కుండా మ‌న ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మ‌రీ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే వైద్యుని స‌ల‌హాతో మందులు వాడ‌వ‌చ్చు. అయితే ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల్లో కూడా ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. అవేమిటంటే… ప‌ప్పుధాన్యాలు, పాల‌కూర‌, గింజ‌ప‌ప్పులు, చికెన్‌, కాబూలీ శ‌న‌గ‌ల్లో ఇత‌ర పోష‌కాల‌తో పాటు ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీంతోపాటు జీల‌క‌ర్ర‌, కొత్తిమీర‌, ప‌సుపు, ఎర్ర మిర‌ప‌కాయ‌లు, బీట్ రూట్‌, ట‌మాట‌లు, యాపిల్స్‌, చెర్రీలు వంటి ఎరుపు ద‌నం ఉన్న పండ్లు, ఆహార ప‌దార్థాల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. వాటిని త‌ర‌చూ తింటుంటే ఐర‌న్ లోపం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

To Top

Send this to a friend