బిగ్ బాస్ ఎఫెక్ట్.. అప్పులపాలైన సంపూ..

బిగ్ బాస్ లో నిష్క్రమణల పర్వం కొనసాగుతోంది. మొదటి వారం జ్యోతి ఎలిమినేట్ అయితే రెండో వారం లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ హౌస్ లో తాను నాలుగు గోడల మధ్య ఉండలేనని పిచ్చెక్కినట్టు ప్రవర్తించి తనను బయటకు పంపాలని సంపూ గొడవ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తనకు ఈ బిగ్ బాస్ ఏమాత్రం నచ్చడం లేదని బయటకు పంపాలని రచ్చ రచ్చ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్… సంపూను హౌస్ నుంచి పంపించి వేసిన సంగతి తెలిసిందే..

అయితే బిగ్ బాస్ లో చేరే ముందే సంపూతో మాటీవీ ఒప్పందం చేసుకుంది. ఆ ఇంట్లో 71రోజులు ఉండాలని ఒప్పందం చేసుకుంటారట.. ఆ ఒప్పందం ఉల్లఘించినా.. బిగ్ బాస్ పంపించకుండా వారే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మాత్రం షోకు జరిగిన నష్టం దృష్ట్యా వారికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోగా నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందంలో ఉంటుంది. ఇప్పుడా ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో సంపూకు భారీ ఫైన్ పడిందని సమాచారం.

బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో సంపూర్ణేష్ కంటిన్యూ అయితే 70లక్షలు మాటీవీ నుంచి పారితోషికంగా దక్కేవి. దాంతో హైదరాబాద్ లో ఓ ఇల్లు కట్టుకుందామని ఆశపడ్డ సంపూ ఇప్పుడు ఏకంగా ఇళ్లు కోల్పోయి.. 16 లక్షలు ఎక్స్ ట్రాగా మాటీవీకే ఫైన్ చెల్లించాల్సి వస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక సంపూ బయటకు రావడంతో మాటీవీ నుంచి ఎలాంటి పారితోషికం రాదట.. బిగ్ బాస్ లో సంపూ కంటిన్యూ అయితే అతడికి 70లక్షల వరకు మాటీవీ పారితోషికం దక్కేట్టు ఒప్పందం కుదిరిందట.. ఇప్పుడు అతడే వైదొలగడంతో ఆ 70 లక్షలు పోవడంతో పాటు 16 లక్షల ఫైన్ మాటీవీకి సంపూ కట్టాల్సి ఉంటుందట..

To Top

Send this to a friend