సంపూతో పూరి సినిమా


టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాత్ తో సినిమా చేసే పరిస్థితి లేదు. గంటలో కథరాసి మూడునెలల్లో మూస సినిమాలు తీస్తున్న పూరిని నమ్మి ఏ హీరో కూడా ముందడుగు వేయడం లేదు. అందుకే పూరి మళ్లీ తన పూర్వపు ఫాం అందుకోవడానికి లేటెస్ట్ గా బాలయ్యతో సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.. అది సెట్స్ పైన ఉండగానే మరో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది..

ఇటీవల బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట ఆడియో రిలీజ్ పూరి జగన్నాత్ చేతుల మీదుగా జరిగింది. అప్పుడే సంపూ టాలెంట్ చూసి ఫిదా అయిన పూరి ఓ కామెడీ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట.. అందుకే కొబ్బరిమట్ట ఆడియో రిలీజ్ చేశాక సంపూతో ఎలాగైనా ఒక సినిమా చేస్తానని ప్రకటించారు. దీంతో బాలయ్య సినిమా తర్వాత పూరి చేయబోయేది సంపూ సినిమానేనని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

To Top

Send this to a friend