షాకింగ్ సంపూ ఆత్మహత్యయత్నం..

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించిన హీరో సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్నాడు. అందులో కేవలం వారం రోజులు కూడా ఉండలేకపోయాడు. నాలుగు గోడల మధ్య ఇమడలేనంటూ ఏడ్చేసి పిరికివాడిగా బయటపడ్డాడు. సంపూ బయటకొచ్చాక తన ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేశాడట. అందులో అందరూ సంపూను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారట.. తన సొంతూరులో కూడా సంపూను తిట్టిపోశారట.

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి వెళ్లాక తిరిగి ఎలిమినేట్ అయ్యేదాకా బయటకు వెళ్లడం కుదరదు.. కానీ సంపూను ఎలా పంపించారనే ఆసక్తి అందరిలోనూ ఉందట.. సంపూర్ణేష్ బాబుకు కొత్త ప్రదేశాల్లో ఉండలేని ఫోబియా ఉందట. పైగా తన ఊరన్నా, వ్యవసాయమన్నా సంపూకు చాలా ఇష్టమట.. అలవాటు పడిన ఆ వాతావరణాన్ని వదిలి, ఒక ఇంట్లో బయటకు వెళ్లకుండా ఉండిపోవడం సంపూ తట్టుకోలేకపోయాడు.

ఈ విషయం బిగ్ బాస్ చెప్పి వెళ్లిపోవాలని చూసినా బిగ్ బాస్ వినలేదట.. దీంతో సంపూ బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో ఉన్న కత్తులతో సూసైడ్ అంటెప్ట్ చేశాడని సమాచారం. టెలివిజన్ ఆడియన్స్ కు ఇది మరీ భయం కలిగిస్తుందేమోనని… ఆ సీన్ ను ఎడిటింగ్ లో తీసేశారట.. అప్పటికే చాలా రోజులుగా హౌస్ లో ఉండలేనంటూ బతిమాలున్నా.. కానీ బయటకు పంపని బిగ్ బాస్ అనడంతో ఈ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. దీంతో ఈ విషయం బయటకు పొక్కితే సీరియస్ అవుతుందని భావించిన బిగ్ బాస్ టీం, సంపూను ఉన్నఫళంగా బయటకి పంపించేశారట.. అతని లగేజీని తర్వాత బయటకు పంపించారు.

ఈ విషయాన్ని ఇటీవలే ఎలిమినేట్ అయిన ఓ సెలబ్రెటీ చెప్పడంతో సంపూ ఆత్మహత్య వ్యవహారం వెలుగుచూసింది.

To Top

Send this to a friend