ఎన్టీఆర్ పట్టుకొని సంపూ ఆవేదన..

హీరో సంపూర్ణేష్ బాబు.. కామెడీ హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఆకర్శించాడు.. బిగ్ బాస్ షో తో తెచ్చుకున్న పేరును, పరువును పోగొట్టుకున్నారు. బిగ్ బాస్ షో నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చిన సంపూ పై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి.. ‘సంపూ సినిమాల్లో పోలీస్ గా.. పౌరుషంగా డైలాగులు చెప్పే నువ్వు షోలో నాలుగు రోజులు ఉండలేకపోయావా.. పిరికిపంద.. నువ్వు హీరోనా..? వేస్ట్ ఫెలో .. సినిమాల్లో కాదు బయటా హీరోలా ఉండు’ అంటూ సెటైర్లు పడ్డాయి..

సంపూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేశాక ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే అందులో చాలా మంది తిడుతూ వ్యాక్యలు పెట్టేశారు. కొందరు ఫోన్ చేసి, కలిసి ముఖం మీదే ఉమ్మేశారట.. ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబే స్వయంగా బిగ్ బాస్ షోలో చెప్పేశాడు.. బిగ్ బాస్ నుంచి అర్థాంతరంగా బయటకొచ్చిన సంపూను నిన్న ఆదివారం రాత్రి బిగ్ బాస్ షోకి తీసుకొచ్చి ఎన్టీఆర్ మాట్లాడించాడు. సంపూ ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో ఏడుస్తూ వెల్లడించారు. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి తప్పు చేశానని.. బయటకు వచ్చాక నేను చేసిన తప్పు అర్థమైందని.. ఫేస్ బుక్ లో తనపై కామెంట్లు చూశాక ఎందుకురా ఈ జీవితం అనిపించిందని వాపోయాడు. జీవితం అంటేనే పోరాడాలని.. దాన్ని నేను చేయలేకపోతున్నానని.. హీరోగా తెరపై కాదు.. జీవితంలో కూడా నిలవలేకపోయానని సంపూ వాపోయాడు..

సంపూర్ణేష్ బాబు ఎట్టకేలకు రియలైజ్ అయ్యారు. తాను బిగ్ బాస్ వదిలి తప్పుచేశానని.. హోమ్ సిక్ తో వీడి ఇప్పుడు బాధపడుతున్నానని తెలిపారు. ఇలా బిగ్ బాస్ నుంచి రావడానికి గల కారణాలు, తాను చేసిన తప్పులను ఏకరువు పెడుతూ వేదికపై ఎన్టీఆర్ ను పట్టుకొని బోరున ఏడ్చేశారు..

To Top

Send this to a friend