జైలు నుంచి సంపూకు విముక్తి..

ఆ నాలుగు గోడలు హీరో సంపూర్ణేష్ బాబుకు జైలులా అనిపించింది. వచ్చినప్పటి నుంచి మూడీగా ఉంటూ ఎవ్వరితోనూ కలవకుండా రూల్స్ పాటించకుండా నెట్టుకొస్తున్న సంపూ మంగళవారం ఇక తాను ఉండలేనని డిసైడ్ అయ్యాడు.. సంపూకు పిచ్చెక్కినట్టు ప్రవర్తించాడు. . తాను వెళ్తాను అని ఏడ్చేశాడు. గొడవ చేశాడు.. ఓరేయ్ బిగ్ బాస్ నువు పంపిస్తావా..? నన్ను తాళాలు బద్దలు గొట్టుకొని వెళ్లమంటావా అని తిరగబడ్డాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో హీరో సంపూర్ణేష్ బాబును పంపించేశారు. అతడి మానసిక, శారీరక స్థితి ఏమాత్రం బాగా అనిపించలేదు.

మంగళవారం బిగ్ బాస్ కార్యక్రమంలో సంపూ ధిక్కరించి వెళ్లడమే సంచలనం. సంపూ వెళ్లాక కార్యక్రమం అంతా చప్పగా మారింది. కామెడీ హీరో, ఉన్న సెలబ్రెటీలలో కాస్త పేరున్న సంపూర్ణేష్ బాబు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి తొక్కలో రూల్స్ పెట్టి హింసిస్తున్నారని వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది.. ఒకానొక దశలో బిగ్ బాస్ పై తిరగబడ్డాడు. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న మంగళవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో హీరో సంపూ ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఇక సంపూ నిష్క్రమణ తర్వాత బిగ్ బాస్ షో మంగళవారం ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ షో ఏమాత్రం ఆసక్తికరంగా సాగలేదు. బిగ్ బాస్ నుంచి సంపూ కోపంతో బయటకు వెళ్లాక ఓ టాస్క్ ను సెలబ్రెటీలు ఆడారు. అడవిలో జంతువులు, వేటగాళ్ల టాస్క్ ఏ మాత్రం బాగా రాలేదు. షో బోర్ కొట్టేసింది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా మంగళవారం సంపూ నిష్క్రమణ ఒక్కటే హైలెట్ కాగా షో మాత్రం ప్లాప్ అయ్యింది.

To Top

Send this to a friend