‘బిగ్‌బాస్‌’లో సంపూ, ముమైత్‌ ఖాన్‌ ఏంటి?

స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షోకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు షో ప్రారంభం అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త ఒక వింత అన్నట్లుగా ఎన్టీఆర్‌ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను బుల్లి తెరపై చూసేందుకు ఉబలాటపడుతున్నారు. ఇప్పటికే ‘బిగ్‌ బాస్‌’ షోకు సంబంధిచిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ షోలో ఎన్టీఆర్‌తో పాటు 12 మంది సెలబ్రెటీలు పాల్గొనబోతున్న విషయం విధితమే. అలాగే ఇద్దరు యాంకర్‌లు కూడా ఈ షోలో సందడి చేయబోతున్నారట.

ఆ ఇద్దరు యాంకర్‌లు మరెవ్వరో కాదు సంపూర్నేష్‌బాబు, ముమైత్‌ ఖాన్‌లుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు జంటగా ఈ షోకు యాంకరిగ్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. ఈ షోకు యాంకరింగ్‌ కోసం సమంత, అనసూయ, విద్య వంటి వారిని సంప్రదించారు. అయితే 70 రోజుల పాటు కంటిన్యూ డేట్లు ఇవ్వడం కష్టం అని చెప్పడంతో వీరిద్దరిని సెటప్‌ చేసినట్లుగా మా వర్గాల వారు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను వెళ్లడి చేయనున్నారు.

తెలుగులో కామెడీ హీరోగా వెలుగు వెలుగుతున్న సంపూర్నేష్‌బాబు మరియు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టి ప్రస్తుతం ఫామ్‌లేక తంటాలు పడుతున్న ముమైత్‌ ఖాన్‌లు బిగ్‌ బాస్‌ షోకు యాంకర్స్‌ ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదో చెత్త నిర్ణయంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

To Top

Send this to a friend