సల్మాన్ వేటాడితే తప్పు.. తెలంగాణలో కాదు..


అది భూపాలపల్లి జిల్లాలోని దట్టమైన అడవులు ఉండే మహదేవపూర్ ప్రాంతం.. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఉండేది ఇక్కడే.. ఆ అడువుల్లో జింకల వేట జరిగింది. ఫారెస్ట్ అధికారులు పట్టుకునే లోపే తూపాకులతో బెదిరించి పారిపోయారు. ఒక వాహనం మాత్రం పోలీసులకు చిక్కింది. అందులో రెండు జింకలు చనిపోయి ఉన్నాయి. ఈ జింకలను వేటాడింది ఎవరు అని పోలీసులు తీగ లాగితే పెద్ద కొండే కనపడింది.

ఆ జింకలను వేటాడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత రెండో ర్యాంకులో ఉన్న ప్రజాప్రతినిధి పుత్రరత్నం అని తేలింది. అతగాడే తుపాకులు పట్టుకొని మహదేవ్ పూర్ అడవికి వచ్చి 5 జింకలను వేటాడి మూడింటితో స్థానిక టీఆర్ఎస్ నేత ఇంట్లో విందు, వినోదాలు చేసుకొని తిరిగి వెళ్తుండగా పోలీసుల కంట పడి తప్పించుకున్నాడట.. ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలకూ చేరింది. కానీ బలమైన వర్గం కావడం.. ఒత్తిడి రావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. స్థానిక నేతలు గొంతెత్తలేదు. కానీ ఒక్క ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది..

పోలీసులు పట్టుకున్న కారు ఓ హైదరాబాదీదీ.. జింకలు వేటాడానికి వచ్చిన కారు ఫజల్ అహ్మద్ ఖాన్ ది అని విచారణలో తేలింది. తెలంగాణ సీఎం తర్వాత స్థానంలో ఉన్న ఉపముఖ్యమంత్రి పుత్రరత్నమే ఈ జింకలను వేటాడేందుకు వచ్చాడని పత్రిక కథనంలో పరోక్షంగా పేర్కొన్నారు. అందుకే వీరిని కాపాడడానికి ఇప్పుడు పైరవీలు నడుస్తున్నాయట.. అందుకే జింకలు చనిపోయినా.. జింకల వేట పెద్ద క్రైం అయినా కూడా వారిపై కేసులు నమోదు కాకపోవడం విస్మయం గొలుపుతోంది. ఈ వ్యవహారంలో సదురు డిప్యూటీ సీఎం కొడుకును కాపాడడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
అయినా తెలంగాణలో ఇవన్నీ మామూలేనబ్బా.. మొన్నటికి ఎంసెట్ లీకేజీ, నిన్నటి ఓటుకు నోటు, నయిం కేసు, నేడు జింకల వేట కేసు.. ఏదీ తేలదు.. ఎవ్వరూ జైలు పాలు కారు.. అదంతే.. ఇది కేసీఆర్ జమానా మరి..

కొసమెరుపు: రాజస్థాన్ లో ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులు జైలు పాలయ్యారు. ఆయనపై కేసు కొన్నేళ్ళు సాగింది. ఇప్పటికీ వెంటాడుతోంది. కానీ ఇక్కడ తెలంగాణ లో అదే పునరావృతమైనా కూడా అధికార పార్టీ అణిచివేస్తోంది. నిజాల్ని పాతరేసి అవినీతి పరుల కొమ్ముకాస్తుందని ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

To Top

Send this to a friend