ఓ పల్లెటూరి పిల్లదానా..


పాత ఒక వింత.. కొత్త ఒక రోత.. కానీ పాతలోనే అద్భుతాలున్నాయని చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్.. అచ్చ తెలుగందాలను వెండితెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. పల్లెటూరి మట్టి వాసనను చూపించబోతున్నాడు. స్వచ్ఛమైన 1985 పల్లెటూరి ప్రేమకథ.. గళ్ళ లుంగీ, గుబురు గడ్డంతో రాంచరణ్, అచ్చు పల్లెటూరీ పరికిణీ వేసుకొని సమంత.. అలరించబోతున్నారు..

స్టార్ హీరోయిన్ సమంత ఒంటరిగా గోదావరి గట్టున కూర్చుంది.. అది ఓ పల్లెటూరి అమ్మాయిలా పాత దుస్తులు వేసుకొని ఇలా తన సోషల్ మీడియాలో ఆ ఉదంతాన్ని రాసుకొచ్చింది. ‘కెమెరా ముందు నొప్పి, వేడి లాంటివి చాలా చిన్నవి.., కెమెరా ఎప్పుడూ అద్భుతాన్నే క్యాప్చర్ చేస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో సమంత రాసుకొచ్చింది. ఓ నీటి గట్టున కూర్చున్న సమంత ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. .

సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. షూటింగ్ ను తిలకించడానికి జనం తరలివచ్చారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్ లో సమంత ఆ పల్లెటూరి అందాలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఓ నీటి గట్టున ఉన్న పిక్స్ అదిరిపోయేలా ఉంది. పల్లెటూరి అమ్మాయిలా సమంత గెటప్ ఉంది.

To Top

Send this to a friend