చైతన్య కోసం సమంత ఎవ్వరూ చేయని పని..

సమంత త్వరలోనే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. ఆ పెళ్లిలో కట్టుకోబోయే చీర గురించి ఓ ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముందుగా సమంత మత ఆచారం ప్రకారం క్రైస్తవ పద్ధతిలో గోవాలో పెళ్లిని అక్టో బర్ 6 నుంచి 9 వరకు మూడు రోజులు మంచి జోష్ తో చేయబోతున్నట్టు సమాచారం. పేరుకు సింపుల్ మ్యారేజ్ అని చెబుతున్నా ఏర్పాట్లలో మాత్రం అదిరిపోయేలా చేయబోతున్నట్టు టాక్.. ఆ తర్వాత హైదరాబాద్ లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది.

సమంత-చైతన్య పెళ్లి అయ్యాక మూడు నెలల పాటు సినిమా షూటింగ్ లకు దూరమవుతున్నారని.. కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.. సమంతకు సంబంధించిన పెళ్లి బట్టలను అన్నింటిని స్టైలిష్ డిజైనర్ క్విషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్టు టాక్.. ముఖ్యంగా పెళ్లి రోజున సమంత కట్టుకోబోయే పెళ్లిచీర నాగచైతన్య అమ్మమ్మది అని తెలిసింది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య డి. రాజేశ్వరికి చెందిన పట్టు చీరకు డిజైనర్ క్విషా తనదైన శైలిలో మార్పులు చేస్తూ దానిపై బంగారపు జరీ అంచు సొగసులు అద్దుతూ ఒక డిఫెరెంట్ గా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం..

సమంత చేస్తున్న పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. సమంత అక్కినేని-దగ్గుబాటి రెండు కుటుంబాలకు చెందిన నాగచైతన్యను పెళ్లిచేసుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో ఆ రెండు కుటుంబాలకు గౌరవాన్ని తెలిపే విధంగా ఈ చీరను డిజైన్ చేయిస్లున్నట్టు తెలిసింది. దీంతో పెళ్లికి ముందే సమంత భర్త తరఫు బంధువులకు ఇస్తున్న గౌరవం చూసి అందరూ ఫిదా అయిపోతున్నారట..

To Top

Send this to a friend