సమంత-చైతన్య పెళ్లి కార్డు వివాదాస్పదం..

సాధారణంగా మనం పెళ్లి కార్డులో ఆహ్వానించువారు..అనే ప్లేసులో అమ్మా నాన్న పేర్లు పెడతారు. కానీ హీరో అక్కినేని నాగచైతన్యకు మాత్రం చిక్కొచ్చి పడింది. ఆయన అమ్మ, నాన్న విడిపోయి వేరుగా ఉంటున్నారు. మరి నాగచైతన్య అమ్మనాన్న ప్లేసులో ఏం రాశాడో తెలిస్తే షాక్ అవ్వక మానరు.. దానికోసం ఈ స్టోరీ చదవాల్సిందే.. అక్కినేని వారి ఇంట పెళ్ళిసందడి మొదలయ్యింది. నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమిచుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంగతి అందరి తెలిసిన విషయమే.. అయితే తాజాగా పెళ్ళిముహుర్తం కూడా ఫిక్స్ అయింది .అక్టోబరు 6 వ తేదీన గోవా లో పెళ్లి జరుగనుంది.దీనికోసం వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింటు చేయించారట.

అయితే ఈ వెడ్డింగు కార్డు కి ఒక ప్రత్యేకత ఉంది .అదేమిటా ఆ కార్డును పరిశీలిస్తే… నాగార్జున మొదట రామానాయుడు కూతురయిన లక్ష్మి ని పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్ళు సాఫిగా సాగిన వీరి సంసారంలో వీరికి ఒక బాబు కూడా పుట్టాడు ఆ బాబే హీరో నాగచైతన్య .ఆ తర్వాత విభేదాలు వచ్చి నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చి అమల ను పెళ్లిచేసుకున్నాడు. అలాగే లక్ష్మి కూడా అమెరికా లో బిజినెస్ చేసే శరత్ ను పెళ్లిచేసుకొని కొన్నాళ్లు అక్కడే ఉంది. వారికి ఒక పాప పుట్టింది. ఇక నాగార్జున-అమలకు అఖిల్ పుట్టాడు. కొన్నిరోజులు తల్లి దగ్గర పెరిగిన నాగచైతన్య ఆ తరువాత తండ్రి హీరోగా ఎంట్రీ కోసం నాగార్జున దగ్గరకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య-సమంత ల పెళ్లి కార్డు లో ఆశర్యకరంగా ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నల పేర్లను ప్రింట్ చేయించడం సంచలనంగా మారింది. వీరి పెళ్లి కార్డులో నాగార్జున-అమల మరియు లక్ష్మి -శరత్ అని ప్రింట్ చేయించారు.

దీనినిబట్టి చూస్తే నాగార్జున తన మొదటిభార్యకు విడాకులు ఇచ్చినా కాని ఆమెకు గౌరవం ఇచ్చి ఆమెపేరు ఆమె భర్త పేరును వెడ్డింగు కార్డు లో ప్రింట్ చేయించారని అర్థం అవుతోంది. ఈ వార్త సొషల్ మీడియాలో వైరల్ గా మారింది .

To Top

Send this to a friend