భ్రమరాంబ పాత్ర ముందు ఎవరి వద్దకు..!

నాగాచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయినా కూడా కాస్త పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రకు మొదట సమంతను దర్శకుడు అనుకున్నాడట.

ఈ చిత్ర కథ నాగార్జునకు చెప్పిన సమయంలో భ్రమరాంబ పాత్రకు గాను సమంతను అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా భ్రమరాంబ పాత్రకు సమంత అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే నాగచైతన్య, సమంతల ప్రేమ విషయం బయటకు రావడం, ఆలాంటి సమయంలో ఈ సినిమా చేయడం వల్ల ప్రేక్షకుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్ధేశ్యంతో నాగార్జున హీరోయిన్‌ను మార్చినట్లుగా తెలుస్తోంది.

మొదట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ అయితే నాగచైతన్యను డామినేట్‌ చేస్తుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దాంతో కాస్త స్క్రిప్ట్‌లో మార్పులు చేసి భ్రమరాంబ పాత్రకు కొన్ని కట్స్‌ చేసి చివరకు సినిమాను తెరకెక్కించాడట. చైతూ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. అయితే లాంగ్‌ రన్‌లో మాత్రం కాస్త నిరాశ పర్చినట్లుగా చెప్పుకోవచ్చు.

To Top

Send this to a friend