ఉయ్యాలవాడతో సల్మాన్‌..!

మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కబోతున్న విషయంపై ఇప్పటికే అధికారిక క్లారిటీ వచ్చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో సురేందర్‌ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను భారీగా నిర్మించాలని చరణ్‌ భావిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడంతో అదనపు హంగులు తప్పనిసరిగా ఉంది.

అందుకే ఈ సినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఈ సినిమా కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌ ఖాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడం వల్ల తప్పకుండా ఈ చిత్రంలో నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది. సల్మాన్‌ ఖాన్‌ చిన్న పాత్ర పోషించినా కూడా బాలీవుడ్‌లో ఈ సినిమాకు భారీగా బిజినెస్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్దం కాబోతున్నారు. రెండు నెలల పాటు పూర్తిగా జిమ్‌లో మరియు కత్తి యుద్దం, కర్ర సాము, గుర్రపు స్వారీలను చిరంజీవి నేర్చుకోనున్నాడు. స్వాతంత్య్ర యోదుడి పాత్రలో చిరంజీవి అచ్చు గుద్దినట్లుగా ఉండేందుకు ఇప్పటి నుండే స్కెచ్‌లు సిద్దం చేస్తున్నారు. భారీ సెట్టింగ్స్‌ వేసి అప్పటి వాతావరణం క్రియేట్‌ చేయబోతున్నారు.

To Top

Send this to a friend